మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండలో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ నెంబర్లు అభ్యర్థులు తో సింగరాయకొండ లో ఎన్నికల సందడి మొదలైంది ఎవరి అభ్యర్థులకు వారు మద్దతు తెలుపుతూ రాబోయే పంచాయితీ ఎన్నికలకు గట్టిగా పోటీ ఇస్తూ ముందస్తుగానే అభ్యర్థులకు మద్దతు ఇస్తూ హోరాహోరీగా జరిగే వాతావరణం లో సింగరాయకొండ మునిగితేలుతోంది ఇలాగే ఎవరి అభ్యర్థికి వారికి సంబంధించినటువంటి ప్రజా ఓటర్లు మద్దతు తెలుపుతూ ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికలు జరిగితే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు సింగరాయకొండలో ఎంతోమంది ప్రెసిడెంట్లు మారారు కానీ ఇప్పుడు కూడా సింగరాయకొండ అభివృద్ధికి పాటుపడుతూ ఉంటాము అని హామీలు ఇస్తున్నారు అంతకుముందు ప్రెసిడెంట్లు గా చేసినటువంటి
అందరూ ఏమేమి అభివృద్ధి చేశారు తమకు తాము ఒక్కసారి తమ ప్రెసిడెంట్ కాలంలోకి వెళ్లి తనకు తాను ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఎన్నిసార్లు ఎంతమంది ప్రెసిడెంట్లు గా అయినా సరే సింగరాయకొండ అభివృద్ధికి నోచుకో లేకుండా పోతుంది సింగరాయకొండ అభివృద్ధి అంటే ఏమిటి…. త్రాగునీరు సైడ్ కాలువలు పునరుద్ధరణ మరియు పేద ప్రజలకు ఉపాధి కల్పన మౌలిక వసతులు కల్పించలేకపోయారు ఇప్పటికైనా పోటీపడే వ్యక్తులు త్రాగునీరు సైడ్ కాలవల పునరుద్ధరణ మరియు మౌలిక వసతులు అన్ని కల్పించి సింగరాయకొండ అభివృద్ధికై పాటుపడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు