• 45 అడుగుల సీసీ రోడ్డుతో నీటి దారి మూసుకుపోయింది..
  • చెత్త తొలగించి,డ్రైనేజీ పునరుద్ధరించాలని ఎమ్మార్వోకు జనసేన నాయకులు వినతి పత్రం..

పెద్ద గంట్యాడ,మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 16: విశాఖపట్నంకు భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, పెదగంట్యాడ మండలంలోని హెచ్.బి. కాలనీ ప్రజలు వరద ముంపు భయంతో వణికిపోతున్నారు.కాలవలు,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో స్వల్ప వర్షానికే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని, ముఖ్యంగా ఎల్.ఐ.జి,ఎమ్.ఐ.జి గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.గాజువాక నుంచి వచ్చే వరద,మురుగు నీరు హౌసింగ్ బోర్డ్ ప్రధాన గెడ్డ నుంచి వెళ్లి, గంగవరం పోర్టు సమీపంలో గల ప్రధాన గడ్డకు కలుపుకుంటూ సముద్రం మార్గంలో కలిసే విధంగా వెళ్లాల్సి ఉంది. గతంలో ముంపుకు గురి అవడానికి జీవీఎంసీ వారు 45 అడుగుల సీసీ రోడ్డు నిర్మాణం చేశారు.ఈ నిర్మాణం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి,నీరు ముందుకు వెళ్లలేక వెనక్కి తిరిగి హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం ముంపుకు గురవుతోందని తెలిపారు.పైగా కాలవల్లో,డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, మూసుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు.ఈ సమస్యపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ జనసేన నాయకులు పెదగంట్యాడ ఎమ్మార్వో కి కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తుఫాన్ వచ్చాక స్పందించడం కాదు,ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.రోడ్డు నిర్మాణం వల్ల ఒక సమస్య తీరితే,మరో పెద్ద సమస్య వచ్చింది. తుఫాన్ వస్తే హౌసింగ్ బోర్డ్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది.ప్రజల ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. పెద్ద గంట్యాడ ఎమ్మార్వో సానుకూలంగా స్పందించి,జీవీఎంసీ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన నాయకులు,జీలకర్ర నాగేశ్వరరావు, ,సార్ పిల్లి ప్రసాద్,,బల్ల సురేష్ జనసేన నాయకులు హౌసింగ్ బోర్డ్ వాసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *