
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్రాథమిక స్థాయిలో ఆర్థిక మరియు వ్యవసాయ సహాయం అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ( పిఎసిఎస్ – ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ) ద్వారా పంట రుణాలు, ఇతర వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు వివిధ రకాల సహకార సేవలు అందుబాటులో ఉన్నాయని రేణిగుంట మండల పిఎసిఎస్ చైర్మన్ వీరాపురం భాస్కర్ రెడ్డి తెలియజేశారు. “రైతు సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం – రైతు అభివృద్ధే మా బాధ్యత” అని పేర్కొంటూ, మండలంలోని రైతు సోదరులందరూ తమ సమీప పిఎసిఎస్ కార్యాలయాన్ని సంప్రదించి, అందుబాటులో ఉన్న ఈ సహకార సేవలను మరియు రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు.
