నిజాంసాగర్, నవంబర్ 16 (మన న్యూస్): నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామానికి చెందిన తప్పెట్ల సైమన్‌కు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు, బహుజన వాద ప్రచారానికి, సమాజ సేవకు చేస్తున్న కృషిని గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ వారు నవంబర్ 15న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన గంగారాం–కమలమ్మ దంపతుల కుమారుడైన సైమన్, చిన్ననాటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారు. గ్రామ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో సమానత్వం, విద్య, చైతన్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అచ్చంపేట ప్రాథమిక పాఠశాలకు తన సొంత ఖర్చుతో పెయింటింగ్ చేయించడంతో పాటు, లక్ష రూపాయలకు పైగా వెచ్చించి పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. హైదరాబాద్‌లో రాయల్ కలర్స్ పెయింట్స్ పనులు నిర్వహిస్తూనే అనాథలు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అచ్చంపేట్ గ్రామ జాతర సమయంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఇలా గ్రామ అభివృద్ధితో పాటు సమాజ సేవలోనూ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న సైమన్‌కు జాతీయ స్థాయిలో అవార్డు లభించడం పట్ల అచ్చంపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ గ్రామానికి చెందిన వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అవార్డు రావడం గ్రామానికే గర్వకారణమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. సైమన్‌ను పలువురు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *