తవణంపల్లి, సెప్టెంబర్ 29: తవణంపల్లి మండలంలోని కాణిపాకపట్నం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్‌వైజర్ నాగరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్‌ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను గ్రామస్తులకు వివరించారు. గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి మంత్రిత్వ యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *