ఉదయగిరి ఆగస్టు 05, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

జీ ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తాన్విష్ లివర్ క్యాన్సర్తో పోరాడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే, తన వంతుగా ₹10,000 (పది వేల రూపాయలు)ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.అంతేకాకుండా చిన్నారి తాన్విష్ తల్లితో స్వయంగా ఫోన్లో మాట్లాడి, చిన్నారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చిన్నారి తల్లి కి తెలిపారు.చిన్నారి తాన్విష్ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ,ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు.వైద్యుల సూచన మేరకు చిన్నారి తాన్విష్కు అత్యవసర శస్త్రచికిత్స (ఆపరేషన్) మరియు చికిత్స కోసం సుమారు ₹40 లక్షలు ఖర్చు కానుంది అని ఆయన అన్నారు. ఈ భారీ మొత్తాన్ని కుటుంబ సభ్యులు భరించడం చాలా కష్టంగా మారింది.ప్రతి ఒక్కరినీ వినమ్రంగా కోరుతు దయచేసి మీకు తోచినంత ఆర్థిక సహాయం అందించి,చిన్నారి తాన్విష్ ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనం చేసే చిన్న సహాయం కూడా ఒక చిన్నారి జీవితానికి కొత్త ఆశను, కొత్త భవిష్యత్తును అందించగలదు అని మనిషికి మనిషి అండగా నిలవడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదు.కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం నిజమైన మానవత్వం,అదే నిజమైన నాయకత్వం అని ఆయన అన్నారు.
