తిరుపతి:- ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తుంటి సుధాయదవ్ ను నియమిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రంను తిరుపతి ప్రెస్ క్లబ్లో అందజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కుర్రా శ్రీనివాస యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడమే కాక
రావాల్సిన పథకాలు బినామీ పేర్లతో పక్క దారి పట్టిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే జనాభా దామాషా ప్రకారం 6 వేల కోట్లు యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తుంటి సుధాయాదవ్ మాట్లాడుతూ తనను నమ్మి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించిన కుర్రా శ్రీనివాస యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల సమస్యల పరిష్కార దిశగా తన అడుగులు ఉంటుందని సుధాయదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు చిన్ని యాదవ్, సురేష్ యాదవ్, శీను యాదవ్, కృష్ణ యాదవ్, హరి యాదవ్, సునీల్ యాదవ్ ఇతర యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.