తిరుపతి, మన ధ్యాస, ఫిబ్రవరి 26:

తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేకంగా “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి జూన్ 3, 2026 వరకు మొత్తం నాలుగు ప్రత్యేక ప్యాకేజీ యాత్రలను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ ఎన్. అశోక్ కుమార్ తెలిపారు.
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ యాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

  1. దివ్య దక్షిణయాత్ర జ్యోతిర్లింగ దర్శనంయాత్ర లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. యాత్ర కాలం:
    21.03.2026 – 28.03.2026 మరియు 24.05.2026 – 31.05.2026 8 రోజులు టికెట్ ధర (ఒక్కొక్కరికి) స్లీపర్ – ₹14,700/-
    రైలు ప్రయాణ మార్గం:
    సికింద్రాబాద్ – జనగాం – కాజీపేట – వరంగల్ – మహబూబాబాద్ – ఖమ్మం – మధిర – విజయవాడ – తెనాలి – ఒంగోలు – నెల్లూరు – గూడూరు – రేణిగుంట.
    2.సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర (SCZBG55)

ఈ యాత్రలో ఉజ్జయిని (మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్), ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్, పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గృశ్ణేశ్వర్) దర్శనాలు కల్పించబడతాయి.యాత్ర కాలం 11 రోజులు
14.04.2026 – 24.04.2026 రైలు ప్రయాణ మార్గం:
సికింద్రాబాద్ – కామారెడ్డి – నిజామాబాద్ – ధర్మాబాద్ – ముద్ఖేడ్ – నాందేడ్ – పూర్ణ.

3.అయోధ్య – కాశీ – బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర

ఈ ప్యాకేజీలో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి పవిత్ర క్షేత్రాల దర్శనం ఉంటుంది. యాత్ర కాలం 8 రోజులు 28.04.2026 – 05.05.2026 మరియు
03.06.2026 – 12.06.2026
టికెట్ ధర (స్లీపర్) ₹16,700/-
రైలు ప్రయాణ మార్గం:
సికింద్రాబాద్ – కాజీపేట – వరంగల్ – ఖమ్మం – విజయవాడ – గుడివాడ – భీమవరం – తణుకు – నిడదవోలు – రాజమండ్రి – సామర్లకోట – తుని – దువ్వాడ – పెందుర్తి – విజయనగరం.

4 హరిద్వార్ – మాతా వైష్ణోదేవి – రిషికేష్ యాత్ర
ఈ యాత్రలో మథుర, బృందావనం, మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేష్ దర్శనాలు కల్పిస్తారు. యాత్ర కాలం:
12.05.2026 – 21.05.2026 టికెట్ ధర (స్లీపర్):
₹16,500/-

రైలు ప్రయాణ మార్గం సికింద్రాబాద్ – జనగాం – కాజీపేట – పెద్దపల్లి – మంచిర్యాల – బెల్లంపల్లి – సిర్పూర్ కాగజ్‌నగర్ – బల్హర్షా – వార్ధా – నాగ్‌పూర్.
ముఖ్యంగాయాత్ర ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస్సు రవాణా, హోటల్ వసతి, రోజుకు మూడు భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కార్ట్ సేవలు అందిస్తారు.
దర్శన స్థలాలకు ఉచిత రవాణా, ప్రయాణ బీమా, రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, ప్రతి కోచ్‌కు సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో రైలులో 705 మంది ప్రయాణికులు ఉండగా, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లను నియమిస్తారు. టికెట్ బుకింగ్ వివరాలఫోన్ నంబర్లు: 9281495853, 828793231 వెబ్‌సైట్:www.irctctourism.com ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీటీసీ టూరిజం ఏరియా మేనేజర్ ఎన్ అశోక్ కుమార్, జి మురళి, పవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *