
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం విశ్వహిందూ పరిషత్ వారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సత్సంఘ్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మండల ఆర్గనైజర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించి, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వహిందూ పరిషత్ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ కటకం కిరీటి బాబు, హాజరయ్యారు
ఈ సందర్భంగా కటకం కిరీటి బాబు మాట్లాడుతూ అజాద్ ఈ పేరు వింటే చాలు తెల్లదొరలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎక్కడ ఏ విధ్వంసానికి పథకం రచించి, తమపై దాడి చేస్తాడోనని ప్రాణాలుఅరచేతబెట్టుకునేవారు. బ్రిటిషర్ల దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడం కోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. మరెందరో వీరులు ఉరికంబమెక్కారు. అలాంటి వారిలో ముఖ్యులు భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్ . అత్యంత పిన్నవయసులోనే దేశం కోసం తమ జీవితాన్నే అర్పించిన.ఆయన దేశం కోసం చేసిన సేవలు విప్లవాలు ఒకసారి నెమరు వేసుకొని నారు. తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం తో బ్రిటిష్ వారితో కడవరకు పోరాడి చివరి నిమిషంలో వారి చేతిలో మరణించడం ఇష్టం లేక ఆఖరి బుల్లెట్టుతో ఆయనకు ఆయన కాల్చుకొని దేశం కోసం బలిదానం అయ్యారు. అటువంటి మహా పురుషుని ఈరోజు స్మరించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. తదనంతరం భగవద్గీత దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాతృ శక్తి అధ్యక్షురాలు కె.రమాదేవి ఉపాధ్యక్షురలు మంగమణి. కార్యదర్శులు మండ సూర్య కుమారి,బేబీ, లక్ష్మీ సత్యవతి, ఎల్లారం, మొదలగువారు పాల్గొన్నారు.