మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5:
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ – “మన సమాజంలోని కొందరు వ్యక్తులు ఇతర మతంలోకి మారినా దానిని దాచిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ కింద లభించే సౌకర్యాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. వీరిపై ఆధారాలతో కోర్టులో కేసులు వేస్తే ఆ రిజర్వేషన్ రద్దవుతుంది” అని తెలిపారు.సమావేశానికి అధ్యక్షత వహించిన హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు డేగల రమేష్ మాట్లాడుతూ, “మతం మారి పదవులు, ఉద్యోగాలు పొందుతున్న వారి వల్ల నిజమైన హిందూ దళితులు నష్టపోతున్నారు. దీని మీద జాతీయ స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ – “హిందూ దళితుల హక్కుల రక్షణ కోసం నేను జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఇది కేవలం ఒకరి మీద మాత్రమే కాదు, వ్యవస్థలో నెలకొన్న లోపాలపై పోరాటం” అని వివరించారు.సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ కింద ఎమ్మెల్యేలు అయిన వారిలో 21 మంది క్రైస్తవ మతం స్వీకరించారని ఆరోపించారు. టిటిడిలో కూడా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ రమాదేవి, హిందూ ధర్మ పోరాట నేత కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

  • By RAHEEM
  • November 18, 2025
  • 2 views
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

  • By RAHEEM
  • November 17, 2025
  • 7 views
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్