బంగారుపాళ్యం మండలం, తగువారిపల్లె గ్రామానికి చెందిన ముబారక్ కు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మండల కమిటీలో సెక్రటరీ పోస్ట్ వరించడం జరిగినది. ఈ సందర్భంగా ముబారక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తనైన నాకు పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ కోసం సాయశక్తుల శ్రమిస్తున్నానని నా కష్టాన్ని గుర్తించి నాకు ఈరోజు సెక్రెటరీ పదవి రావడం సంతోషంగా భావిస్తూ పదవి అలంకారప్రాయం మాత్రమే రాబోవు రోజులలో పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం ఎల్లవేళలా రెట్టించిన ఉత్సాహంతో కష్టపడుతానని ఈ పదవి రావడానికి సహకరించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త సునీల్ కుమార్ కి, మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి కి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా కి, మండల వైస్ ఎంపీపీ శిరీస్ రెడ్డి కి మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మండల నాయకులను కలిసిన వారిలో యూత్ ప్రెసిడెంట్ గజేంద్ర, మహేంద్ర, షాకీర్, ఖాదర్ బాషా , గఫార్, జగదీష్, మనీ, మంజూ, నజీర్ ఉన్నారు.









