

అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :///
ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇందుకు సీఎం కు, ప్రభుత్వానికి గురువారం ధన్యవాదాలు తెలిపారు. నాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని అడిగితేనే అరెస్టు చేసి, చంపేయమన్న రోజులు చూశామని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసుల సంఘం గుర్తింపును రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చారన్నారు. గవర్నర్‌ను కలవడమే నాటి ప్రభుత్వానికి నేరంగా కనిపించిందని, అయితే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అరాచక నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుని రాజ్యాంగ హక్కులను కాపాడిందన్నారు.