అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు విడపనకల్లు మండలం పాల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, వాటి అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘సురక్ష’ ఎల్ఈడీ డిస్ప్లే బొలేరో వాహనం ద్వారా గ్రామాలు, పాఠశాలలకు వెళ్లి, ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు ప్రదర్శిస్తూ ప్రజలు, విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు (డిజిటల్ అరెస్టు, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, APK ఫైల్ ఫ్రాడ్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్), రోడ్డు ప్రమాదాల నియంత్రణ, గంజాయి, మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు.







