వినాయక చవితి మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరి…. కలిగిరి ఎస్సై ఉమాశంకర్…////

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు ,ఆగస్టు 26:

మీ భద్రత – మా బాధ్యత అంటున్న ఎస్సై మాశంకర్..

కలిగిరి మండల పోలీస్ వారి విజ్ఞప్తి కలిగిరి మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి-భద్రత-సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ….. ఈ విధంగా తెలియజేశారు.గణేష్ విగ్రహప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన ముఖ్యమైన మార్గదర్శకాలు..వినాయకచవితి, ఉత్సవాలు,పోలీస్ ,విధ్యుత్ శాఖల అధికారుల అనుమతితో నిర్వహించాలి అనుమతి తప్పనిసరి: ఏవైనా గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలంటే పోలీస్ నుండి అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో ganeshutsav.net ద్వారా అప్లై చేయాలి.మండపం స్థాపన రహదారి పైన, ట్రాఫిక్కు ఆటంకం కలిగించేలా ఉండరాదు, ఒక వైపు మాత్రమే ఏర్పాటు చేయాలి. గణేష్ విగ్రహాలను పర్యావరణ హితం దృష్టిలో ఉంచుకొని మాత్రమే పెట్టాలి. పాప్ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), రసాయన రంగులు వాడటం మానుకోవాలి. గట్టి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలి,మైక్ మరియు స్పీకర్లు ఉపయోగించడానికి ముందు సంబంధిత కలిగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అనుమతి తీసుకోవాలి,ఉత్సవ ప్రాంగణంలో,ఉత్సవ కమిటివారు మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్దులకు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ఉత్సవ కమిటివారు మండపం నందు త్రాగునీరు,అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలి ఉత్సవ కమిటివారు మండపంలో విధ్యుత్ అలంకరణను జాగ్రతగా ఏర్పాటు చేసుకొనవలెను.ప్రతి రోజు రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు లౌడ్స్పీకర్లు వినియోగించరాదు,అశాంతి కలిగించే నినాదాలు, పాటలు మరియు మద్యం సేవించడం వంటి అనుమతి లేని కార్యక్రమాలకు,పాల్పడరాదు.సి సి టీవీ మరియు సురక్షిత ఏర్పాట్లు: సీసీటీవీ లు 24×7 రికార్డింగ్ ఉండాలి. మండపాలు/ఉత్సవ ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ (నీరూ, ఇసుక) ఉండాలి. మంటలు పట్టే పదార్థాలు దాచరాదు.ప్రతి మండపంలో కనీసం ముగ్గురు వాలంటీర్లుఉండాలి, వారి కాంటాక్ట్ డిటైల్స్ స్థానిక పోలీసులకు ఇవ్వాలి.అత్యవసర సమయంలో 112 కు కాల్ చేయాలి.విగ్రహ నిమర్జన: అధికారులు సూచించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమర్జన. ఊరేగింపులు నిర్ణిత మార్గాల్లో, నిదానంగా సాగాలి పటాకులు నిషేధం మరియు నిమజ్జనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలి ఉత్సవ కమిటివారు నిబంధనలు ఉల్లంఘించినపుడు అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా గణేష్ పండుగను సురక్షితంగా, పర్యావరణ హితంగా, శాంతియుతంగ జరుపుకోవాలని కలిగిరి ఎస్ఐ ఉమాశంకర్ కోరారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు