

దుత్తలూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 25 :////
దుత్తలూరు మండల కేంద్రం లో క్యూఆర్ కోడ్ తో అనుసంధానించిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు మండలం దుత్తలూరు 1 రేషన్ దుకాణం పరిధిలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి జనసేన పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు బిజెపి నాయకులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో పట్టుదలతో పేదప్రజలకు ఉపయోగపడే విధంగా రేషన్ కార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నూతనంగా సాంకేతికత జోడించి స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేయించి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. స్మార్ట్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ ను తమ సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ వస్తాయన్నారు. గతం రేషన్ కార్డుల్లో అనేక తప్పులు ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారిని ఇక ఆ ఇబ్బందులు ప్రజలకు తీరినట్లేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందించి సూపర్ హిట్ కొట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డీసీఎం పవన్ కళ్యాణ్ యువ నేత మంత్రి నారా లోకేష్ లా తోడ్పాటుతో కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.