
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని, కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బరాయుడు తో పాటు పలువురు బాధితులు పేర్కొన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా తో మాట్లాడుతూ……. 2023లో వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ను తాము తీసుకున్నామని వివిధ పాఠశాలలకు బుక్స్ పంపిణీ చేసేందుకు తమతో అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. వచ్చిన ఆదాయంలో తమకు వాటా ఇస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్న తమకు ఒక పైసా కూడా ఇవ్వలేదన్నారు చివరకు తాము డిపాజిట్ చేసిన కోటి రూపాయలు అసలు కూడా కంపెనీ ఎండి సౌందర్య భార్గవి ఇవ్వలేదన్నారు. చివరకు హైదరాబాదు కార్యాలయం కూడా ఎత్తివేసారన్నారు.ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. చివరగా నెల్లూరు ప్రజలకు మా విజ్ఞప్తి ముక్కు మొహం తెలియని కంపెనీ వ్యాపారం ద్వారా ఆదాయం పొందండి ,లాభాలు పొందండి ఆకర్షించి డబ్బులు డిపాజిట్ చేయమంటారు వీటిని నమ్మకండి ,మోసపోకండి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాధితులు సర్దార్ ,హసీనా, బీబీ జాన్, మెహతాజ్, సునీల్ ,మాలాద్రి పాల్గొన్నారు.
