

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, ఆగస్టు 23 :*స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకం.*మహిళలందరికీ ఈ పథకం చాలా ఉపయోగకరం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.మన ధ్యాస, నెల్లూరు రూరల్ ,ఆగస్టు 23:నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ ఆధ్వర్యంలో జరిగిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్త్రీ శక్తి కార్యక్రమానికి హాజరైన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 90 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా నెల్లూరు రూరల్ ను అభివృద్ధి చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎప్పుడైనా రావచ్చు. ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించినా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మరింత చేరువుగా ప్రజల్లోకి తీసుకెళ్లండి అని నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎల్లవేళలా మహిళల ఆశీస్సులు ఉండాలి అని నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ అన్నారు.పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి పార్టీల మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

