
మన న్యూస్, కావలి, ఆగస్టు 23: ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరతీసిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో శనివారం మీడియా సమావేశం మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేకమందిపై కేసులో నమోదు అవుతున్నాయి అని అన్నారు.ఎవరు లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏమిటి.జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అన్నారు.కావలి నియోజకవర్గం లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. 10 ఏళ్ళు ఎమ్మెల్యే గా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కేసులు నమోదుచేశారు.సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటితాజా కేసులలో ఎవరు కేసులు పెట్టారు ,వారి వెనుక ఎవరు ఉన్నారు అంతా తెలుస్తాం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సౌమ్యడు అని అందరికీ తెలుసు.అక్రమ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని అన్నారు.దాడులుజరిగుతుంటపోలీసులు మౌనం వహిస్తున్నారు.జిల్లాపోలీస్ఉన్నతాధికారులు జీతాలు కోసం పని చేస్తున్నారు అని అన్నారు.ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి అండగా ఉంటాం. వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
