

వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న పోలీసులు, ప్రొజెక్టర్ ద్వారా అవగాహన వీడియోలను ప్రదర్శించారు. సైబర్ నేరాల ముప్పు, వాటిని నివారించుకునే మార్గాలు, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, బాల్య వివాహాల చట్టపరమైన నిషేధాలు వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. అలాగే “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, ఏవైనా అనుచిత సంఘటనలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు ఎస్‌ఐ, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.