

దుత్తలూరు మన న్యూస్ ప్రతినిధి:
అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం13-8-2025 ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ కదిరి వెంకట రంగారావు ,జనసేన ఇన్చార్జి.కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొంటారు.
ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమినాయకులుకార్యకర్తలు పాల్గొని ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు
మేకపాటి మాల్యాద్రి నాయుడు
నేడు మంగళవారం నర్రవాడలో
పత్రికా విలేకరుల సమావేశంలో రైతు సోదరులకు పిలుపునిచ్చారు
వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో పథకంలో భాగంగా రైతు సోదరులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ అమలకుశ్రీకారంచుట్టినకూటమినాయకులు రైతులకు తెలియజేసే లక్ష్యంతో
ట్రాక్టర్ ర్యాలీని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలోఈకార్యక్రమంజరుగుతుందని తెలియజేశారు.ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం దుత్తలూరు ఎమ్మార్వో ఆఫీస్ సమీపము నుండి ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ సముదాయం వరకు రైతు సోదరులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ గారు రైతుల అభివృద్ధి ఆకాంక్షించే మన ప్రధానమంత్రి గారు రైతులకు సబ్సిడీపై పనిముట్లను ట్రాక్టర్లను ఇచ్చిన ఏకైక నరేంద్ర మోడీ గారు మాత్రమే అని తెలియజేశారు .ఇచ్చిన మాట ప్రకారం రైతు పెట్టుబడి కొరకు ₹7,000 రూపాయలు రైతు సోదరుల ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు..ఉదయగిరి నియోజకవర్గం నుండి అన్నీపంచాయతీలనుండితెలుగుదేశం,జనసేన,బిజెపి,నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ ట్రాక్టర్లు ర్యాలీని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని మేకపాటి మాల్యాద్రి నాయుడు కోరారు..