డ్రైవర్లకు ఉరితాడు వంటి జీఓ నంబర్ 21ని రద్దు చెయ్యాలి

మన న్యూస్ సాలూరు, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15వేల రూపాయలు చొప్పున అందించిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, డ్రైవర్లకు ఉరితాడు వంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. సిఐటియు జిల్లా కార్యదర్శి, పై సంఘం అధ్యక్షులు ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు, గాంధీ నగర్, వేద సమాజం వీధి, శివాజీ సెంటర్, బోసు బొమ్మ సెంటర్ మీదుగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాహన మిత్ర పథకాన్ని అందజేయాలని నినాదాలు చేసారు. అనంతరం బోసు బొమ్మ సెంటర్ వద్ద కార్మికులను ఉద్దేశించి నాయుడు తోపాటు పలువురు నాయకులు మాట్లాడారు. క్యాబ్ డ్రైవర్లకు నష్టం చేకూర్చే జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలన్నారు. లైసెన్స్ కలిగి ఉన్న నిరుద్యోగులకు ఆటోలు, క్యాబ్ ల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను కూటమి ప్రభుత్వం ఇప్పించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలు చేసి ప్రతి ఒక్కరికి 15వేల రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేసారు. కూటమి ప్రభుత్వం తీరును ఎండగడుతూ గర్జించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల పొట్ట కొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని, మహిళలకు ఉచిత బస్సు కారణంగా తాము నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేస్తూ ఒక్కొక్కరికి 15వేలు చొప్పున చెల్లించాలన్నారు. వేరు, వేరుగా జరిగిన ర్యాలీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు