ఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ వ్యతిరేక దిశలో పోరాటం చేస్తోందని ఐసా కన్వీనర్ భీమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కన్వీనర్ పథకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భీమేష్ మాట్లాడుతూ 9 ఆగస్టు 1990లో ఐసా స్థాపించారు. నేటికీ 35 సంవత్సరాలవుతుంది. విద్యార్థి హక్కులు ప్రజా సమస్యల పోరాటంలో ఐసా ముందు వరుసలో ఉండి మత రాజకీయాలను ఓడించింది. ఒక నూతన భారతదేశం ఒక నూతన ప్రపంచం అనే నినాదంతో దేశవ్యాప్తంగా దృఢంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఆగస్టు 9న క్రాంతి దివాస్ అలహాబాద్ లో జరిగింది. 11వ మహాసభలను విజయవంతంగా జరుపుకొందని తెలిపారు. బిజెపి మత ఫాసిస్టు రాజకీయాలకు, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక ఆర్థిక వ్యతిరేక ఉద్యమాలకు ఐసా మద్దతునిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఉరవకొండ మండల అధ్యక్ష కార్యదర్శులు హరి నాయక్, వినయ్ మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్,సహాయ కార్యదర్శి మంజు నాధ్, కమిటీ సభ్యులు విజయ్, వంశీ, సూరి, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *