

మన న్యూస్, తిరుపతి:
జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తెలియని ఇస్రో తన విజయ పరంపరను కొనసాగిస్తుందని కొనియాడారు. వాతావరణ పరిశీలన కోసం పంపిన అనే నిసార్ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరడం గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, గుండాల గోపీనాథ్, ఏవన్ మస్తాన్, జయంతి కుమార్, జగదీష్, లోక ప్రభాకర్ నాయుడు, నాన్నయ్య ఆచారి,కేశవులు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సిద్ధేంద్ర శర్మ కోటేశ్వరరావు సునీల్ కుమార్ స్వామితదితరులు పాల్గొన్నారు.
