ఎవరు అధైర్యపడవద్దు – మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి

మన న్యూస్ సాలూరు జూలై 29 :- పీఏసీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు పీడిక రాజన్నదొర సమావేశం ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మన్యం ప్రాంత పరిస్థితులు గూర్చి,మన్యం ప్రజల కోసం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మన్యం ప్రాంతంలో ఒకప్పుడు అల్లూరి విప్లవంలా ఇప్పుడు జగనన్న ప్రజా విప్లవం రావాలని ప్రజలు కోరుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు పిడికరాజన్నదొర, ఈరోజు తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, పి ఏ సి సభ్యులు రాజన్నదొర సమావేశం ముగిసిన అనంతరం ఏపీ సీఎం,వైసీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేశారు.రాజన్న బాగున్నావా?మన్యం ప్రాంతం ఎలా ఉంది రాజన్నా?మన్యం ప్రజలు ఎలా ఉన్నారు?మీ జిల్లాలో నీ సహచర ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మన పార్టీ నాయకులు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల సభ్యులను అధైర్య పడవద్దని,వారికి ధైర్యంగా ఉండమని భరోసా ఇవ్వాలని తెలిపారన్నారు.మన కార్యకర్తలకు ఇంతకు ముందులా కాకుండా మన పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి మంచి ప్రాధాన్యత ఉంటుందని, వారికి మంచి రోజులు వస్తాయన్నారు.అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు అందరితో మమేకమై గ్రామగ్రామాన పర్యటించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో గూర్చి అనుబంద విభాగాల కమిటీ సభ్యులు,నాయకులు,కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మన్యం జిల్లా ప్రజలు బాగులేరన్నారు, మీరు సీఎంగా ఉన్నప్పుడు అందిన సంక్షేమ పథకాలు ఇప్పుడు వారికి అందడం లేదని అన్నారు. ఇంటింటికి వంచన బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమానికి గ్రామాల్లోకి వెళ్తున్న సమయంలో మాతో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో వారి పడుతున్న భాధలు,ఇబ్బందులు చెపుతున్నారన్నారు.ఒకప్పుడు మన్యంలో అల్లూరి విప్లవంలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన్యం ప్రాంతంలో “జగనన్న ప్రజా విప్లవం” రావాలని,మీ పాలనను మళ్ళీ మన్యం ప్రాంత ప్రజలు కోరుతున్నారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర తో పాటు,గజపతినగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొత్స.అప్పలనరసయ్య ,విజయనగరం మాజీ ఎంపీ, పి ఎ సి సభ్యులు,బెల్లాన.చంద్రశేఖర్ (పెదబాబు) కూడా ఉన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..