

మన న్యూస్ పాచిపెంట, జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఈ నెల 31వ తేదీలోగా చెల్లించాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు వెల్లడించారు. మండలం మిర్తి వలస గ్రామంలో వి ఏ ఏ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలని వరి పంటకు ఎకరానికి 800 రూపాయలు తో ఆగస్టు 15 వరకు సమయం ఉందని మొక్కజొన్న రైతులు కు సమయం తక్కువగా ఉన్నందున దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా లేదా గ్రామ సచివాల ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ ల ద్వారా పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు.మొక్కజొన్న మరియు వరి పంటలపై బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులు బ్యాంకులలో ప్రీమియంను మినహాయించమని కోరాలని తెలిపారు. పంటల భీమా ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుండి ఆదుకుంటుందని రైతులు పంటలకు బీమా చేయించుకోవడానికి ఒక అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఏంటి అవసరాల కోసం మాత్రమే వాడే వరి పంటలో ఎలాంటి ఎరువులు పురుగు మందులు వేయకుండా పండించుకోవాలని ప్రకృతి సేద్యానికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం ఎదిగిన పంటలపై బస్తా యూరియా ఎరువులు వాడకుండా నానో యూరియా నానో డిఏపి వాడుకోవడం ద్వారా ఎరువుల వృధాను అరికట్టి సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం పత్తి పంటపై పేను బంక ఆశించిందని దీని నివారణకు తయోమెథాక్సిమ్ అనే మందును 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క బాగా తడిచేటట్టు పిచికారి చేయాలని సూచించారు.పంటల అధిక దిగుబడికి భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండాలని నవధాన్యాల ద్వారా భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్ద కొత్తల పోలినాయుడు మాట్లాడుతూ ఎరువులకు గోడౌన్ చూపిస్తామని తమ గ్రామానికి రైతు సేవా కేంద్రానికి చాలా దూరంగా ఉందని దాని వలన సకాలంలో ఎరువులు అందడం లేదని కాబట్టి రెండు పంటలు పండించే రైతులో ఉన్నందున గ్రామంలో ఎరువులు అందేటట్టు చూడాలని కోరారు.