

మన న్యూస్,తిరుపతి :– తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియం ను సోమవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తనిఖీ చేశారు. ప్రత్యేక ఎంపోరియం లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలు, వివిధ రకాల ప్రతిమలు, శాలువలు విక్రయాలు, వాటిని దిగుమతి చేసుకుంటున్న వివరాలు, ఎక్కడి ఎక్కడి నుంచి స్టాక్ తెప్పిస్తున్నారు అన్న వివరాలను ఉద్యోగులను అడిగి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలుసుకున్నారు. అలాగే అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చొరవ చూపుతానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియంను మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
