

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :-జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్ద పోతులపాడు శివారులోని క్వారీలో అక్రమంగా ఎర్రమట్టిని కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు.ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పదులకొద్దీ టిప్పర్ల సహాయంతో అక్రమార్కులు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అంతేకాక రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని గ్రామస్తులు మండిపడ్డారు.అనుమతుల పేరుతో వెంచర్లకు అక్రమంగా ఎర్రమట్టిని తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత మైనింగ్ శాఖ రెవిన్యూ శాఖ, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. దీనిపైన జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా .. గ్రామంలో కొందరు నల్ల మట్టిని తరలిస్తుండగా పోలీసులు వాటిని పట్టుకున్నారు.మరి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నటువంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీటి వెనక పోలీసుల యొక్క అంతర్యం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు కోరుతున్నారు.