

గూడూరు, మన న్యూస్ :- ఏపీజే అబ్దుల్ కలం వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగ పవన్ మరియు శ్రీమతి బి సులోచన రాణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గూడూరు వారి సమక్షంలో రెండు కానుగ మొక్కలు నాటి తర్వాత డాక్టర్ ఏ బి జె అబ్దుల్ కలాం వర్ధంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి గురించి మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్ లోనికి ఏ విధంగా నిరాడంబరంగా వెళ్లారు రాష్ట్రపతి పదవి కాలం ముగిసిన తర్వాత అదే విధంగా రెండు సూట్ కేసుల బట్టలతో బయటకు వచ్చిన మహానుభావుడని ఎంతోమంది ఈ దేశానికి ఎందరో రాష్ట్రపతులు దేశాన్ని పాలించినను నిజాయితీగా నిరాడంబరుడుగా వారి చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు ఈ దేశానికి సేవ చేస్తూనే వారు మరణించినారు అని చెప్పిరి శ్రీమతి బి సులోచన రాణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ భారత దేశ రాష్ట్రపతులలో ఒక శాస్త్రజ్ఞుడు రాష్ట్రపతి కావడం మన దేశానికి గర్వకారణమని మరియు ఈ దేశం కొనియాడదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం ని కొనియాడారు మరియు కోర్టు ప్రాంగణంలో నాలుగవ తరగతి ఉద్యోగిలుగా పనిచేస్తున్న స్త్రీలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు సయ్యద్ తాజుద్దీన్ మాట్లాడుతూ ఈ ట్రస్టును చాలా నిజాయితీగా అధికారుల యొక్క ప్రోత్సాహంతో నడుపుతున్నానని ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నానని చెప్పుతూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పిరి మరియు అరవ పార్వతయ్య న్యాయవాది మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తిరుపతి జిల్లా వారు మాట్లాడుతూ ఈ దేశం యొక్క చరిత్రను ప్రపంచ పటం మీదకి తీసుకొచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి మరియు ఈ దేశ రాష్ట్రపతిగా చేస్తూ నిజాయితీగా ఉండిన అబ్దుల్ కలాం గారు చిరస్మరణీయుడు మరియు వారి చివరి క్షణాల వరకు భావి భారత పౌరులైన విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు వారి భవిష్యత్తు గురించి చెప్పుతూనే మరణించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిరి
