

గూడూరు, మన న్యూస్ :- గూడూరులో ఓటమిని తట్టుకోలేక… ఓటమిని గౌరవించలేక… ప్రజల తీర్పును తుంచేసే స్థాయికి వైసీపీ నేతలు మాటలు ద్వారా దిగజారారని తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్ విమర్శించారు.. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ది “యమధర్మ పాలన” అంటారా? అంటే గూడూరు ప్రజలు యముని గెలిపించారా? ఇది ప్రజలపై చేసిన అగౌరవం కాదు అంటారా? వాస్తవానికి గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలే గూడూరును నరకం చేశారు. గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మద్యం మాఫియా, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు… ప్రజలు ఇంట్లో భయంతో ఉండే రోజులు మీరే తీసుకొచ్చారు. అసలు “యమధర్మ పాలన” అంటే అదే. …ప్రజలు మీ పాలనను తిరస్కరించి మార్పు కోసమే టీడీపీకి అధిక మెజారిటీ ఇచ్చారు. మీకు నీతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల్లోనే శాంతి చేకూర్చి, అవినీతికి అడ్డుకట్ట వేసే పాలన అందిస్తుంటే దాన్ని చూడలేక బిక్కుబిక్కుమంటున్నారు.. ప్రజల సాక్షిగా చెబుతున్నాం – వైసీపీకి ప్రజల తీర్పును అవమానించడమో, దానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడమో ఆఖరి పరిణామం కలుగుతుంది. ఇకనైనా వైసీపీ నేతలు తమ మాటలకు అద్దం చూపించుకోవాలి. లేకపోతే గూడూరు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. గతంలో నియోజకవర్గంలోని దళితులను ఇబ్బంది పెట్టే వారిని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కొంతమంది వైసిపి నాయకులు సునీల్ కుమార్ ని ఎత్తి పెట్టుకో ఉన్నారని ఇకనైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకుని ప్రభుత్వానికి సహకరించి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిచేందుకు తోడ్పాటు అందించాలని దయాకర్ కోరారు