

గూడూరు, మన న్యూస్ :- నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నామని వాస్తవాలు తెలుసుకొని వైసిపి నాయకులు మాట్లాడాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ సురేంద్ర వెల్లడించారు
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడిపి SC నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ సురేంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ ST లకు గుర్తింపు ఇచ్చి వారి ఎదుగుదలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంతో ప్రోత్సహించారని ఎమ్మెల్యే పై వాకాడులో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎస్సీలను ఎదగనీయడం లేదని చెప్పడం అవాస్తమని అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో గూడూరు నుండి ముగ్గురికి అవకాశం ఇచ్చారని ఇప్పటికైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితువు పలికారు ఈ సమావేశంలో వేముల సునీల్ ,మల్లి ,గురవయ్య , శివ ,పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు .