మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సర్వే,ఆన్-లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీని ఆపరేటర్లు తప్పులు దొర్లకుండా నిర్వహించేందుకు ఎనుమరేటర్లు తప్పనిసరిగా వారి దగ్గర ఉండి నమోదు చేయించాలని అన్నారు.అవసరమైతే అదనంగా ఆపరేటర్ల సంఖ్యను పెంచుకొని కంప్యూటర్లు,ల్యాప్ ట్యాప్లు ట్యాబ్ లతో ప్రతిరోజు సాయంత్రం పారదర్శకంగా పనులు చేపట్టాలన్నారు డోర్ లాక్,ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో వలసలు వంటి కారణాలవల్ల అసంపూర్తిగా ఉన్న సర్వేను పూర్తి చేసేందుకు వారి ఫోన్ నెంబర్లు సేకరించి కాల్ చేసి వివరాలు సేకరించి పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట సమయంలో సర్వే నమోదు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సుచించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు,జడ్పీ సీఈఓ కాంతమ్మ,డిపిఓ శ్యామ్ సుందర్,ఎంపీడీవోలు ఏపీఓలు ఏపీయంలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *