మన న్యూస్: అశ్వాపురం బుధవారం రాత్రి అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం కాసబోయిన శ్రీనివాస్,అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, హాజరై మాట్లాడుతూ మల్లెలమడుగు గ్రామంలో, పేదలకి బడుగు బలహీన వర్గాలకు వేలఎకరాలు భూమి పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదని, ఈ గ్రామాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రోడ్లు, విద్యుత్తు, స్కూల్స్, అభివృద్ధి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని , పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఒకప్పుడు మొండికుంట, మల్లెలమడుగు,గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండేదని నేడు నాయకుల్లో కూడా స్వార్థం ఎక్కువైందని అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని వారన్నారు. అనంతరం, మల్లెలమడుగు శాఖ సమావేశంలో 20 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, కార్యకర్తలు అందరూ సిపిఐ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇవ్వడం జరిగింది,, ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులుకమటం సురేష్,నెల్లిపాక సొసైటీ డైరెక్టర్,కోడి వెంకన్న,సిపిఐ పార్టీ మండలసహాయ కార్యదర్శులు,దంతాల జగదీష్,కమటం వీరన్న, బుర్ర యాదయ్య,చిలకమర్రి అయోధ్య,ఆకుల అంజయ్య,దంతాల రామయ్య, కాసమల్ల మల్లయ్య, తోట సాంబశివరావు, కంట శ్రీనివాస్,సహదేవ్,సిపిఐ పార్టీ కార్యకర్తలు,తదిరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *