గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 ” అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్:

తిరుపతి, Mana News 17.07.2025 : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా, గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని లిమిరోడియన్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్ కేంద్ర ఉపరితల మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వాటర్ చెక్ డాన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఉచిత వైద్య సేవలు,తాగునీటి సౌకర్యాలు మరియు పశుసంవర్ధక ఆసుపత్రి ఇతర సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది.

ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ “గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు ద్వారా గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని మా సంస్థ ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని తద్వారా మా వంతు కృషి చేస్తున్నాము ముందు కూడా చేస్తుంటాము మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ శ్రీ గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ “ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా రాజన్న ఫౌండేషన్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని” అని అన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు