

గూడూరు, మహా న్యూస్ :- మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మల్లెపు విజయ లక్ష్మి గార్లతో కలిసి జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు పాల్గొని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమం రూపొందించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వారు ఎదురకొంటున్న సమస్యలతో జనవాణి కార్యక్రమంకు వచ్చి వారి సమస్యల పరిష్కరించుకోవడం జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన పార్టీ పెద్దలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
