

మన న్యూస్, పాచిపెంట,జూలై 16:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండల సమాఖ్యలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు యొక్క దస్త్రాలలో పక్కాగా నమోదు చేయాలని పాచిపెంట వెలుగు ఏపిఎం రెడ్డి శ్రీరాములు కోరారు. బుధవారం నాడు పాచిపెంట వెలుగు కార్యాలయంలో 36 గ్రామ సంఘాలు, మండల సమైక్య,రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలును చార్టెడ్ అకౌంటెంట్ బుగత రాజేష్ క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు ఆడిటర్లు, గ్రామ సంఘాలకు సంబంధించిన నగదు పుస్తకము,తీర్మానాలు, రసీదులు, ఓచర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ సంఘాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి గ్రామ సంఘం అధ్యక్షురాలు కు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్సికే సత్యంనారాయణ, సి సి లు,వి ఓ ఏ లు తదితరులు పాల్గొన్నారు.