

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఇటీవల తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదయినందుకు, అలాగే జాతీయ స్వచ్చంద సేవా సంస్థ అయిన తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో పద్మ డా॥ నందమూరి తారకరామరావు , భారత రత్న పి.వి నర్సింహారావు జయంతి ఉత్సవాలు-2025 పురస్కరించుకుని డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు పొందినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ తోటి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ పీర్ కుమార్ గత 25 సంవత్సరాలుగా అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూనే నటనపై మక్కువ చూపుతూ టీవీ, నాటక రంగంలో నటిస్తూ రచయితగా కూడా గుర్తింపు పొందడంతో ఈ మధ్య కందుకూరి విశిష్ట పురస్కారము లభించిందని అదేవిధంగా ప్రస్తుతం ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యా , కళారంగానికి తన వంతు సేవలు అభినందించదగినవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కే. కోటేశ్వరరావు, శ్రీ శ్రీధర్ శర్మ, కే. రవిరాజు, శ్రీమతి లక్ష్మీ హిమబిందు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.