

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 జిల్లా మహాసభలు మద్రాస్ బస్టాండ్ దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ సమావేశంలో ఆదివారం ఘనంగా జరిగినాయి.ముందుగా జన విజ్ఞానిక వేదిక నాయకులు జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకం ఆవిష్కరించి సభను ప్రారంభించినారు. ఈ జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా జన విజ్ఞాన జాతీయ అధ్యక్షులు కే. నాగేశ్వరావు హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల పై ప్రజలను చైతన్య పరుస్తూ అజ్ఞానం నుండి విజ్ఞానవైపు తీసుకువెళ్తుంది అని అన్నారు.గతంలో ఎన్నో పోరాటాల ద్వారా ప్రజా సమస్యలపై పోరాడి చైతన్య చేయడం జరిగిందన్నారు.యువత నేను అనేది కాకుండా మనం అనే తద్వారా సమాజం మార్చగలము అని అన్నారు. సమాజం బాగుంటే మనం బాగుంటాం అని అన్నారు.ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు.వెలగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోబడినది. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ షేక్ రఫీ, జిల్లా అధ్యక్షులుగా షేక్ గౌస్ బాషా, ఆరుగురు గౌరవ అధ్యక్షులు, ఆరుగురు ఉపాధ్యక్షులు ఆరుగురు కార్యదర్శులు ఎన్నుకోబడినారు. అనంతరం పలువురు జన విజ్ఞాన వేదిక నాయకులను సత్కరించారు .ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి ,శేషారెడ్డి ,చక్ర పాణి, సుధాకర్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





