

మన న్యూస్ సాలూరు జూలై :- అభివృద్ధిని అడ్డుకొని కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు మండిపడ్డారు. మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్ అధ్యక్షతన పెద్దబోరబంద గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆముదాల పరమేష్ బొచ్చ శ్యామ్ భాస్కరరావు తదితరులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మంత్రి సంధ్యారాణి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తే , ఆయా పంచాయితీల సర్పంచులు అభివృద్ధిని అడ్డుకోవడానికి తీర్మానం ఇవ్వకుండా కోర్టుకెళ్ళింది వైసీపీ నాయకులేనని తెదేపా నాయకులు వైసీపీ నాయకుల తీరును తప్పుపట్టారు. తెదేపా ఏడాది పాలనలో సాలూరు మండలం కూర్మరాజుపేట, మరిపిల్లి దిమిసి రాయి పంచాయతీల్లో 20 కోట్లకు పైబడి బీటీ రోడ్లు, సిసి రోడ్లు, గోకులాలు నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని వైసీపీ నాయకులకు గుర్తు చేశారు. విద్యార్థుల పాఠశాల భవనం విషయంలో కూడా రాజకీయ్య రంగు పులమడం తగదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం మాని సహకరించాలని కూటమి నాయకులు వైసీపీ నాయకులకు హితపలికారు.