

మన న్యూస్ సాలూరు జూలై 4:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పట్టణంలో ప్రముఖ ఉపాధ్యాయుడు రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు పెట్టినందుకు కల్కి జూనియర్ షాప్ ఓనర్ కోలగట్ల. గోపాలరావు( గోపి)ని 41 నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతని అల్లుడు మాదిటి సుధీర్ పూచికత్తుపై స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు స్థానిక విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే సాలూరు పట్టణం లో ఎందరో పేద విద్యార్థులకు చదివిస్తూ అలాగే సంఘ సేవ చేస్తున్న మాస్టారు రంభ రజినీకాంత్ పై గతంలో కోలగట్ల గోపి టౌన్ పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ కేసు పెట్టడం జరిగింది. అనంతరం రంభ రజనీకాంత్ పై తప్పుడు కేసు అని సాలూరు కోర్టులో తీర్పు రావడంతో ఆయన పై కేసు పెట్టిన గోపి పై ఐపీఎస్ 177 క్రింద చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టువారి ఆదేశాల ప్రకారం 67/2025 నెంబర్ తో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అలాగే ప్రాథమిక విచారణ అనంతరం కోలగట్ల గోపాలరావు (గోపి) ని అరెస్ట్ చేశారు.ఇలాగే తప్పుడు కేసులు పెట్టిన వారికి తగిన శిక్ష పడుతుందని ఈ కేసుతో రుజువైంది.