

విడపనకల్, మన న్యూస్ :- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం కొట్టాలపల్లికి చెందిన కురువ ఎరిస్వామి అనే అంధుడి వారసత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. వెల్పుమడుగు గ్రామ పరిధిలోని 3.75 ఎకరాల భూమిని మొదుపల్లి చంద్రబాబు నకిలీ పత్రాలతో తన పేరిట చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. అధికారులు విచారణకు వచ్చిన జూలై 2న చంద్రబాబు మద్యం మత్తులో రౌడీలతో కలిసి అక్కడికి వచ్చి, ఎరిస్వామిని అధికారుల ముందే బెదిరించాడట. గ్రామ VRO రంగప్పనాయుడు నిందితులకు అండగా వ్యవహరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారుల దృష్టిని కోరుతున్నాడు