

గూడూరు, మన న్యూస్ :- తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న శ్రద్ధతో మా ఊరు బడి మాకు కావాలి – బయట గ్రామాలకి మా పిల్లలను పంపించలేం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడంపై శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని యం.ఇ.ఓ. డి. రవీంద్రబాబును స్థానిక సి.ఐ.టి.యు నాయకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలోనికి వెళ్లి పాఠశాలలకు తమ పిల్లలను పంపమని వారి తల్లిదండ్రులను కలిసి విద్యార్థులకు చదువులు ఆపవద్దు, దయచేసి చదివించండి, పాఠశాలకు పంపించండి, అని వారికి తెలియజేయడం జరుగుతూ ఉందని, తల్లిదండ్రులు జూలై 10 వరకు గడువు కోరడం జరిగిందని, ఆయన తెలియజేశారు. ఆయా పాఠశాలలకు ఒక కిలోమీటరు పైబడి దూరం ఉన్న విద్యార్థులను గుర్తించి సమాచారం ఇవ్వమని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగిందని, విద్యార్థుల రవాణా ఖర్చులకు గాను ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000/-(వెయ్యి రూపాయలు) లెక్కన వారికి సంబంధించిన తల్లికి వందనం అకౌంట్లలో జూన్,జూలై,ఆగస్టు నెలలకు సంబంధించి రూ.3000/- రూపాయలు వేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించిన బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ తమ పిల్లలను చదువుకు దూరం చేయడంతో దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు చదువుకు స్వస్తి పలికి ఇంటి దగ్గరే పిల్లలను ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాయకులు కలగచేసుకొని ఆయా పాఠశాలలు పక్కనే అదనపు గదులు ఏర్పాటు చేసి తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించి చదువులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.