

మన న్యూస్ పాచిపెంట, జూలై 2:- అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని విజయనగరం మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు పేర్కొన్నారు. బుధవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం మాతృభూమి సేవ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మాతృభూమి సేవ సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎన్విఎన్ విజయనగరం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు పాల్గొని దాతలు నుండి రక్త సేకరణ చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ సికిల్ సీనిమియా, రక్త హీనత కలిగిన గర్భిణీలకు ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని కోరారు మీరు ఇచ్చే రక్తంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాచిపెంట తాసిల్దార్ డి.రవి సూచించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదాతలుగా నిలుస్తామని కళాశాల ప్రిన్సిపల్ కట్టా జాన్సీ తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యంకి గురికామని ఎలాంటి అపోహలు పోవద్దని సంస్థ సభ్యులు కటారి ఈశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో 40 మంది దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని సంస్థ సభ్యులు వివరించారు. కార్యక్రమం అనంతరం కళాశాల విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.