

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపి ఇరవై మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి వెంకటేష్ శెట్టి తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారులు వచ్చేనెల 4 న హైదరాబాద్ లోని హకీంపేట్ క్రీడా పాఠశాలల్లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారు తెలంగాణ క్రీడ పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశం పొందనున్న ట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారుల్లో బాలికలు కే సింధుజ, కే శ్రీనిధి, శ్రీవల్లిక, పూజ, సాయి శుక్లరెడ్డి, కే అక్షయ డి వెన్నెల, ఆర్ సావిత్రమ్మ, ఎం అశ్విని, బి శిరీష, బాలుర విభాగంలో ఎం కార్తీక్, ఎస్ ఈశ్వర్, పి నితిన్, అంకిత్ కుమార్, పవన్ సత్వత్, బి నిశాంత్ బి శ్రీకాంత్, ఎల్ హర్షవర్ధన్, వర్షిత్ కుమార్, ఏ తేజ లు ఉన్నారు రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలకు ఎంపికలకు ఎంపికైన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, లు అభినందించారు.