ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రాలు అందజేత

మన న్యూస్: మణుగూరు, సత్వరమే కొత్త బొగ్గు గనులు ప్రారంభించాలి మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఉన్నగనులకు విస్తరణ అనుమతులు సాధించాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి,మహబూబా బాద్ ఎంపీ పొరిక బలరాం కి శుక్ర వారం నాడువినతి పత్రాలు అందజేసినట్లు ఐఎఫ్ టీ యు అనుబంధ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతున్న ఓసి గనులు మూత పడనున్నాయని. కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందని ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మణుగూరులో కొత్త గనుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి, ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని. అన్ని గనులు సింగరేణి ఆధ్వర్యంలోనే నడిపించాలని ప్రజా ప్రతినిధులను కోరినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు మణుగూరుకు వరద ముంపు నివారిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని, ఇటీవల భారీ వర్షాలకు వరద ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు ఇందిరమ్మ పక్కా ఇల్లు నిర్మించాలని కోరారు. అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,సింగరేణి భూ నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాల యువతకు, సింగరేణి డిపెండెంట్ లకు, స్థానికులకు సింగరేణి ఓబి కంపెనీలలో, సెక్యూరిటీ, ఇతర సివిల్ కాంటాక్ట్ పనులలో ఉపాధి అవకాశాలు కల్పించాలని,మణుగూరులో ట్రాఫిక్ నివారణకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులు మణుగూరులో ఐదు సెంట్ల భూమిలో గృహ నిర్మాణం చేపడితే ఇబ్బందులు లేకుండా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపూడి కోటేశ్వరరావు, ఎస్ డి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి