

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాల గురించి కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు.పార్టీ వ్యతిరేక శక్తులు కొందరు ఏకమై పార్టీ ప్రతిష్టను దిగజార్చి పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆ దుష్ట శక్తుల కుట్రలు తిప్పి కొట్టేవిధంగా మన తదుపరి కార్యాచరణ ఉండాలని దిశా నిర్దేశం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.