

వ్యక్తి గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతంకు కృషి చేయాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులదే అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గుల్ గుస్తా లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలల్లో రోడ్లు,డ్రైనేజీలు,గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణం,మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని సూచించారు.నిరంతరం ప్రజల మధ్య ఉంటూ,వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని కోరారు.పార్టీ సిద్ధాంతాలకు లోబడి క్రమ శిక్షణతో పని చేయాలని,కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని కోరారు.యువజన కాంగ్రెస్ ఎన్అస్యూఐ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.వ్యక్తి గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని,కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,నాయకులు ప్రజాపండరి,అనీస్,తదితరులు ఉన్నారు
