

ఎస్ ఆర్ పురం, మన న్యూస్:- ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పోటీకి నువ్వా నేనా అంటూ సై సై అంటూ ముందుకు దూసుకుపోతున్నట్లు సమాచారం… ఎస్ ఆర్ పురం మండల అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్ఆర్ పురం మండలంలో మొదటిసారిగా హిమాచలపతి రెడ్డి మరల ప్రతిసారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎస్ఆర్ పురం మండల అధ్యక్ష పదవి అనుభవిస్తున్నారు. అంటే ఎస్ఆర్ పురం మండలంలో మిగిలిన సామాజిక వర్గాలు మండల అధ్యక్షు పోటీకి పనికిరారా ?? అంటూ ఎస్ ఆర్ పురం మండలంలో బీసీలు, ఎస్సీలు మైనారిటీలు చర్చించుకుంటున్నారు .. ఎస్ ఆర్ పురం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉండే నాయకుడు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు నాయకులకు మంచి జరిగినా చెడు జరిగినా వారిని పలకరించి చేదోడు వాదోడుగా ఉండే సమర్థవంతమైన నాయకుడు అయితేనే ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడిగా నియామకానికి అర్హుడు అలా లేకుండా వారికి నచ్చినట్లు వారికి అనుకూలంగా ఉన్న వాళ్లకు వత్తాసు పలికే నాయకుడు మాకు అవసరం లేదు అంటూ ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారు. ఎస్ ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షుడు పోటీకి గంధమనేని రాజశేఖర్ నాయుడు, గంధమనేని జయశంకర్ నాయుడు, గుత్తా వేమన నాయుడు బి కే ఎన్ మునివర్ధనాయుడు, సాఫ్ట్వేర్ బాలు, కే యం రవి ,పైనేని మురళి, ఎస్ ఆర్ పురం టిడిపి మండల అధ్యక్షుడు పోటీకి ఆశావాహులుగా పోటీ పడుతున్నారు. ఈసారి ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సహకారంతో ఎస్ఆర్ పురం మండల అధ్యక్ష పదవి ఎవరికి వరించనుందో ??? కమ్మవారికి వరిస్తుందో లేకుండా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు అధ్యక్ష పదవి వరిస్తుందో వేచి చూడాలి మరి?..