
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విఆర్ఓ విఆర్ఏ సర్వేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సబ్యులు కిషోర్, సత్యరావు,వాసు, ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.వీఆర్వోల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలుచేశారు.వీఆర్వోలు సర్వేయర్లు, వీఆర్ఏలు సమస్యలు వెంటనే పరిష్కారించాలని నినాదాలు చేపట్టారు.ఈ సందర్భంగా వీఆర్వో కిషోర్ మాట్లాడుతూ వీఆర్వో వీఆర్ఏ సర్వేయర్ల పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.వీఆర్వో వీఆర్ఏ సర్వేలకు డిడిఓ గా స్థానిక ఎమ్మార్వో నియమించాలని కోరారు.
పలు మండల ఉన్నతాధికారుల పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన చెందారు. మేము ఉన్నతాధికారుల సూచనలు తప్పక పాటిస్తామని తెలిపారు.పనికి మేము వ్యతిరేకం కాదని మాకు పని నిర్దేశించేది ఒక్కరే అయి ఉండాలని వారన్నారు.అమరావతి జాయింట్ కమిటీ పిలుపుమేరకు ఈరోజు రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మా న్యాయమైన సమస్యను పరిష్కరించని ఎడల మార్చి ఒకటవ తేదీ నుండి మా ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అవసరాల కిషోర్,అధ్యక్షులు కొట్టేటి సత్యారావు, సెక్రటరీ రొంగల శ్రీను,డివిజన్ ఈసి సభ్యులు మద్దిల వాసు, కాసాని అనిల్ అప్పికొండ వరప్రసాద్,
వీఆర్వోలు మణికంఠ, బాలరాజు, భారతి, లక్ష్మణరావు, రమణ, సూర్యా ప్రకాష్, లక్ష్మణ, షేక్ దాదా సాహెబ్, తదితరులు పాల్గొన్నారు
