పది ఫలితాల్లో విపిఆర్‌ విద్య ప్రభంజనం.

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23: నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు. – 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  మానసపుత్రిక, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్‌ విద్య పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో పి. గాయత్రి అనే విద్యార్థిని 600కు 587 మార్కులు సాధించి టాప్‌లో నిలిచింది. తర్వాత వి.వైష్ణవి 584 మార్కులు, వి.వర్ష 581 మార్కులు సాధించారు. పదో తరగతిలో ఫలితాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..29 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 27 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించడం విశేషం.
నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించేందుకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కనుపర్తిపాడులో VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో ‘వి.పి.ఆర్‌ విద్య’ పాఠశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ వస్తున్నారు. పాఠశాలలో చదివే నిరుపేద పిల్లలకు అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలు, షూస్‌, బ్యాగ్స్‌, ఇతర వస్తువులు అన్నీ ఉచితంగానే ఇస్తారు. పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పోషకాలు కలిసిన భోజనాన్ని పిల్లలకు మధ్యాహ్నం ఉచితంగా పెడతారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ద్వారా స్వచ్ఛమైన తాగునీరును పిల్లలకు సమకూరుస్తున్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..