మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని బీసీ భవన్ లో రాష్ట్ర రజక కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం కరాటే చంద్ర అన్న సముద్రం మధులు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసిపి పాలనలో ధోబి ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టిన దాఖలాలు అయితే ఎక్కడ లేవన్నారు. రజకులు ధోబి ఘాట్లు లేక నాన్న అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా జిల్లాలో దోభి ఘాట్ల నిర్మాణ పనులతో పాటు శిధిలమైపోయిన ధోబి ఘాట్ల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రజకులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా వారికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, చైర్మన్ ప్రత్యేక చొరవ చిత్తూరు తిరుపతి ధోబి ఘట్లా మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అందుకు చైర్మన్ సావిత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు కరాటే చంద్ర తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *